కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు పాఠశాల విద్యార్థులకు ప్లకార్డులు ఇచ్చి ఎండలో నిలబెట్టారు. అలాగే కార్యక్రమం కూడా ఎండలో సాగడంతో దానికి హాజరైన వారిలో కొందరు నీడ చూసుకుని గోడల పక్కకు, చెట్ల చెంతకు వెళ్లడం కనిపించింది. బహిరంగ సభలో సౌకర్యాలు లేకపోవడం, ఎండ కూడా ఎక్కువగా ఉండటంతో కార్యక్రమం మొదలైన కొద్దిసేపటి తర్వాత వారు వెనుదిరిగారు. భద్రత పేరుతో పట్టణమంతా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో దుకాణదారులు, స్థానికులు అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రోడ్‌షో సందర్భంగా గొల్లప్రోలులోని, పిఠాపురంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల వాహనాలను సభకు జనాన్ని తరలించేందుకు ఉపయోగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సాయం కోరాలని వచ్చి..
వెన్నెముక గాయంతో దీర్ఘకాలంగా బాధపడుతూ శస్త్రచికిత్స చేసేందుకు ఆర్థికసాయం మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరేందుకు తల్లిదండ్రులతో వచ్చిన దివ్యాంగురాలు రాజులపూడి సాయిలక్ష్మి చంద్ర.. ఆయనను కలవలేకపోయారు. ఆమెను తల్లిదండ్రులు వీల్‌ఛైర్‌లో తీసుకొచ్చినా.. భద్రతాసిబ్బంది అంగీకరించలేదు. నేతలకు సమస్య వివరించబోతుండగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అంబులెన్సులో అక్కడినుంచి తరలించారు. ఇప్పటివరకు ఆమె చికిత్సకు రూ.80 లక్షల వరకు ఖర్చయిందని, మరో పెద్ద శస్త్రచికిత్సకు రూ.కోటి ఖర్చవుతుందని వైద్యులు చెప్పారన్నారు.
ఇవీ చదవండి: