ETV Bharat / city

KANNABABU: 'అమూల్ కోసం ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటే తప్పేంటి' - minister kannababu

అమూల్(amul) కోసం ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటే తప్పేముందని మంత్రి కన్నబాబు(minister kannababu) అన్నారు. నాణ్యమైన ఎరువులు(fertilizers) ఇవ్వడమే ఆర్‌బీకే(RBK)ల లక్ష్యమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఎరువుల ఉత్పత్తి తగ్గిందని వ్యాఖ్యానించారు.

మంత్రి కన్నబాబు
మంత్రి కన్నబాబు
author img

By

Published : Oct 8, 2021, 5:06 PM IST

మంత్రి కన్నబాబు

అమూల్(amul) కోసం ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటే తప్పేముందని మంత్రి కన్నబాబు(minister kannababu) అన్నారు. అమూల్ అనేది కార్పొరేట్ సంస్థ కాదని, అది కోపరేటివ్ ఫెడరేషన్(co-operative federation) అని తెలిపారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులపై సీఎం జగన్(CM jagan) నిర్వహించిన సమీక్ష(review)లో మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గ్రామాల్లో మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాల(multi purpose fecilities centres) ఏర్పాటును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని... కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదన్నారు. నాణ్యమైన ఎరువులు ఇవ్వడమే ఆర్‌బీకేల లక్ష్యమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఎరువుల ఉత్పత్తి తగ్గిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 27 చోట్ల ఆహారశుద్ధి కేంద్రాలు(food processing units) ఏర్పాటు చేశామన్న మంత్రి.. నూజివీడు, అరకులోనూ ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను స్థాపిస్తామని వెల్లడించారు.

ప్రతి గ్రామంలో మల్టీపర్పస్ ఫెసిలిటీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కేంద్రాల పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదు. ఎరువుల కొరత ఉందనేది దుష్ప్రచారం మాత్రమే. రాష్ట్రంలో 27 చోట్ల ఆహారశుద్ధి కేంద్రాలు స్థాపిస్తాం. అమూల్ కోసం ప్రభుత్వ ఉద్యోగుల సేవలు తీసుకుంటే తప్పేంటి?. -కన్నబాబు, మంత్రి

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.