అమ్మ, నాన్న, ఓ కూతురు... ఎంతో ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంలో ప్రేమ కలవరం రేపింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురు... వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో అలజడి రేగింది. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన ప్రేమికుడు ఓ వైపు... జీవితాన్నే తన కోసం ధారబోసిన తల్లిదండ్రులు మరోవైపు. ఈ పరిస్థితుల నడుమ ఆ యువతి మానసికంగా నలిగిపోయింది.
ముక్కూమొహం తెలియని వ్యక్తి... తమ కూతురును బాగా చూసుకుంటాడా..? లేదా.. ? అనే సంశయంతో కన్నబిడ్డ ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు ఆ తల్లిదండ్రులు. ఏ నాటికైనా తల్లిదండ్రుల మనసు మారి, తన కుటుంబాన్ని చేరదీస్తారని భావించిన ఆ తనయ... ప్రేమ పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకుంది. ప్రియుడితో కలిసి నేరుగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి వివాహానికి సిద్ధమైంది. కొందరు స్నేహితుల మధ్య వీరి వివాహ క్రతువు ముగిసింది.
విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు... సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. కూతురును అడ్డుకుని ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. భర్తను వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. ఉద్రిక్త ఘటనల మధ్య నవవధువును తన తల్లిదండ్రుల నుంచి వరుడు బలవంతంగా తీసుకువెళ్లాడు. కూతురు తమను విడిచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. కాకినాడలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
ఇదీచదవండి.