Fishermen got stuck in sea: కాకినాడలోని పర్లోపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయారు. బోటు యజమాని కాసరపు కన్నారావు, మత్స్యకారులు కాసరపు గుర్రయ్య, పోతురాజు, ఎల్లాజి, చింతపల్లి చిన్న, పొట్టి సందీప్ గత నెల 30న చేపల వేటకు కాకినాడ రేవు నుంచి బయల్దేరారు. రెండ్రోజుల తరువాత బోటు ఇంజిన్ మరమ్మతులకు గురవడంతో నడి సంద్రంలో ఆగిపోయింది. 3న భీమునిపట్నం, విశాఖ మధ్యలో ఉన్నట్లు జీపీఎస్ రీడింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఆ తరువాత వారి నుంచి సమాచారం ఆగిపోయింది.
Fishermen got stuck in sea: బాధితుల ఆచూకీ తెలుసుకోవాలని 12వ వార్డు తెదేపా కార్పొరేటర్ సునీత, తెదేపా నాయకుడు తుమ్మల రమేష్, మత్స్యకార కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. మత్స్యకారుల ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదని, విశాఖ అధికారుల సహాయంతో ఇండియన్ కోస్టు గార్డు బృందాలు, ప్రైవేటు బోట్లతో సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నామని మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.8.49 కోట్లు టోకరా