కాకినాడకు చెందిన మోహన్ నేమాని కుటుంబం అమెరికాలో స్థిరపడింది. 2010లో వారు కాకినాడ బీచ్‌ను సందర్శించారు. మోహన్ తన కుమారుడు ప్రణవ్, కూతురుకి బీచ్‌లో గింజాల పెదసత్తియ్య వద్ద వేరుశనక్కాయలు కొన్నారు. పర్సు మర్చిపోవడంతో అతనికి డబ్బులివ్వలేకపోయారు. అప్పుడు ప్రణవ్ అతడితో ఫొటో దిగారు. అప్పటినుంచి వారు కాకినాడ వచ్చిన ప్రతిసారీ అతని కోసం వాకబు చేసినా ఫలితం లేకపోయింది.
మోహన్ తన స్నేహితుడైన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఆ విషయం చెప్పారు. ఎమ్మెల్యే తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రణవ్ తీసుకున్న ఫొటోను పోస్టు చేశారు. పెదసత్తియ్యకు సంబంధించిన వారుంటే సంప్రదించాలని, తన పీఏ ఫోన్‌నంబరు ఇచ్చారు. చివరికి అతని కుటుంబం జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో ఉంటున్నట్లు గుర్తించారు. పెద సత్తియ్య మరణించగా, ఆయన కుటుంబసభ్యులను గురువారం కాకినాడ ఎమ్మెల్యే ఇంటికి పిలిపించి, ఎన్‌ఆర్‌ఐ మోహన్, ఆయన పిల్లలు రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.
ఇదీ చదవండి: