ETV Bharat / city

మత్స్యశాఖలో మాయాజాలం.. సంతకాల ఫోర్జరీతో రూ.6 కోట్లు మాయం - fisheries department fraud

ఉభయగోదావరి జిల్లాల్లో పనిచేసిన ఓ మత్య్స శాఖాధికారి ఫోర్జరీ సంతకాలతో సుమారు రూ. 6 కోట్ల మేర నిధులను మాయం చేసినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు అధికారి కరోనాతో మృతి చెందిన కారణంగా.. అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయమై... పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

fd amounts diverted with fake signatures in fisheries department
మత్స్యశాఖలో మాయాజాలం
author img

By

Published : Aug 4, 2021, 6:58 PM IST

పశ్చిమ గోదావరిజిల్లా మత్స్యశాఖలో భారీగా అక్రమాలు చోటుచేసుకొన్నాయి. మత్య్స శాఖలోని ఓ అధికారి.. ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి కోట్ల రూపాయల మేర నిధులను పక్కదారి పట్టించారు. సుదీర్ఘకాలం ఆయన జిల్లాలో పనిచేశారు. కొంతకాలంపాటు తూర్పుగోదావరిలోనూ సేవలందించారు. ఇటీవల కొవిడ్‌తో ఆయన మృతి చెందాక.. ఈ అవకతవకలన్నీ వెలుగుచూశాయి. చివరికి... ఆ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు జిల్లాల్లోనూ సదరు అధికారిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు ప్రస్తుతం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అవినీతికి పాల్పడింది ఈయన ఒక్కరేనా.. భాగస్వాములు ఇంకా ఉన్నారా.. సంతకాలు ఫోర్జరీ చేసింది ఈయనేనా.. ఎవరితోనైనా చేయించారా అనే అంశాలపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం మేరకు.. మత్స్యశాఖకు సంబంధించిన వివిధ ఫిక్స్​డ్ డిపాజిట్లలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. చెక్కులపై ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి.. ఓ అధికారి అవినీతి చక్రం తిప్పాడు. జిల్లా మత్య్స శాఖలో గతంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌)గా పనిచేసిన పద్మనాభమూర్తి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఉభయగోదావరిజిల్లాల పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

ఒక్కరేనా.. ఇంకా ఉన్నారా..

మత్స్య శాఖకు సంబంధించి రాయితీపై మేత, షెడ్ల నిర్మాణం.. ఇలా అనేక పథకాలకు ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు దస్త్రాల్లో గుర్తించారు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లను పరిశీలించారు. అనధికార లావాదేవీలూ జరిగినట్లు తెలిసింది. మత్య్స శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఇదంతా సదరు అధికారే చేశారా.. ఆయనకు ఎవరైనా సహకరించి ఫోర్జరీ సంతకాలు చేశారా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పద్మనాభమూర్తి ఏలూరు మత్స్య శాఖలో 12 ఏళ్లు పనిచేశారు.

సీనియర్‌ అసిస్టెంట్‌ హోదా నుంచి సూపరింటెండెంట్‌గా.. ఆ తర్వాత ఏడీగా ఇక్కడే పదోన్నతి పొందారు. ఈ అవినీతి అంతా ఆయన పరిధిలో జరిగింది కనుక ఆయనే దీనికి బాధ్యులని అధికారులు చెబుతున్నారు. దీనిపై మత్స్య శాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ కేఎస్‌వీ నాగలింగాచార్యులు మాట్లాడుతూ తూర్పుగోదావరిలో అవినీతి వెలుగుచూడటంతో ఇక్కడ కూడా పరిశీలించగా.. అవకతవకలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. దర్యాప్తు అధికారి మూడవ పట్టణ సీఐ వరప్రసాద్‌ మాట్లాడుతూ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

అక్రమాలు వెల్లడైందిలా..

పద్మనాభమూర్తి మృతి చెందాక.. అదే నెలలో ఉన్నతాధికారులు ఆయన అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. పలు దస్త్రాలను పరిశీలిస్తున్న సమయంలో ఈ విషయం వారికి వెల్లడైంది. రూ.2 కోట్ల మేర తూర్పు గోదావరి జిల్లాలో అవినీతి జరిగినట్లు తెలుసుకుని కాకినాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పశ్చిమ గోదావరి మత్య్స శాఖ ఉన్నతాధికారులు ఇక్కడా దస్త్రాలను పరిశీలించారు. 2019 నుంచి ఇక్కడ కూడా అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఏలూరు మత్స్య శాఖ కార్యాలయంలో రూ.4.12 కోట్ల నిధులు దారి మళ్లినట్లు గుర్తించగా మత్య్సశాఖ జేడీ(ఇన్‌ఛార్జ్జి) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మత్స్యశాఖలో ఫిక్స్​డ్ డిపాజిట్లను అవినీతి అధికారి దారి మళ్లించాడు. ఫోర్జరీ సంతకాలతో చెక్కులను సృష్టించాడు. ప్రైవేటు వ్యక్తుల ఖాతాలను ఏర్పాటు చేసుకొని.. ఈ చెక్కుల ద్వారా డబ్బులు ఆయా ఖాతాల్లోకి బదిలీ చేశాడు. మత్స్యశాఖకు చెందిన ఫిక్స్​డ్ డిపాజిట్ల నుంచి నిధులు డ్రా అవుతున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. చెక్కులపై ఫోర్జరీ సంతకాలు చేసినా.. బ్యాంకులు గుర్తించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి సంయుక్త సంచాలకులైన పద్మనాభమూర్తి ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడినట్లు మత్స్యశాఖ నుంచి ఫిర్యాదులు అందడంతో.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు అంటున్నారు.

ఇదీ చదవండి:

Rape case: పాపం పాస్టర్​ది.. ఫలితం అమాయక బాలికది..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.