ఇదీ చదవండి:
'రెండేళ్లలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తాం' - Union Minister santhosh gangwar ap tour
కాకినాడలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ శంకుస్థాపన చేశారు. స్థానిక సాంబమూర్తినగర్‌లో ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రమంత్రి భూమి పూజ చేశారు. రూ.110 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. రెండేళ్లలో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐ ఆసుపత్రి పరిధిలోకి వస్తారని... వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఇటీవల కార్మికులకు క్యాన్సర్ అధికంగా వస్తోందని... కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రిని క్యాన్సర్ పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రులు గంగ్వార్‌ను కోరారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్