తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జవహర్ సెంటర్లోని వద్ద ఉన్న తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించడంపై నగరంలోని బాలాజీ సెంటర్‌లో మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. చరిత్రలో అనేక కీలక ఘట్టాలకు, ప్రాణత్యాగాలకు కేంద్ర బిందువుగా నిలిచిన చోట నుంచి విగ్రహాన్ని తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నగరంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ చోటుచేసుకోలేదని వారు అన్నారు. నూతన విగ్రహంఏర్పాటుకు భూమి పూజ చేసారు.
తొలగించిన విగ్రహాన్ని ప్రభుత్వమే తిరిగి పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ భూమి పూజ చేసినచోటే విగ్రహాన్ని ఏర్పాటుచేస్తుందని స్పష్టం చేశారు. రాత్రికి రాత్రి దొంగచాటుగా విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. సత్యాగ్రహానికి తాము సిద్ధమని నేతలు హెచ్చరించారు. తిరిగి ప్రతిష్ఠించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే సైలజానాథ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: రూ. 10.72 లక్షల విలువైన గంజాయి పట్టివేత