కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. కొవిడ్ సమయంలో అవసరమైన రక్షణ పరికరాలు ఇవ్వాలని.. బీమా సౌకర్యం కల్పించాలని.. కనీస వేతనం 21వేల రూపాయలు ఇవ్వాలని, ప్రతినెలా 5లోపు జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు