ETV Bharat / city

కాకినాడలో వీధి శునకాలకు చికెన్​ బిర్యానీ - kakinada city news

కొవిడ్ సమయంలో.. పేదలు, నిరాశ్రయులు, ఉపాధి కోల్పోయిన వారికే ఆహారం దొరకడం కష్టమైంది. మూగజీవాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన కొందరు.. అలాంటి జంతువుల ఆకలి తీరుస్తున్నారు. గడప దాటి బయటకు వచ్చేందుకే జంకుతున్న ఈ విపత్కర సమయంలోనూ.. వీధివీధి తిరిగి శునకాలకు ఆహారం అందిస్తున్నారు.

pet lover feeding street dogs
మూగ జీవాల ఆకలి తీరుస్తున్న జంతు ప్రేమికుడు
author img

By

Published : May 29, 2021, 9:21 AM IST

మూగ జీవాల ఆకలి తీరుస్తున్న జంతు ప్రేమికుడు గోవిందరాజులు...

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కొండయ్యపాలేనికి చెందిన గోవిందరాజులు.. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో తీరిక లేకుండా గడుపుతూనే.. మరో వైపు శునకాల ఆకలి(Feeding street dogs) తీరుస్తున్నారు. మొదట్లో ఉదయం మాత్రమే కుక్కలకు బిస్కెట్లు అందించేవారు. రెండేళ్లుగా బిర్యానీ తయారు చేసి రాత్రి సమయాల్లోనూ క్రమం తప్పకుండా శునకాలకు పెడుతున్నారు. మూగజీవాల ఆకలి తీర్చడం కోసం రోజూ 30 కేజీల బియ్యం, పది కేజీల కోడిమాంసంతో.. బిర్యానీ చేస్తున్నారు. ప్యాకెట్లలో నింపుకొని.. కాకినాడలోని వీధుల్లో తిరుగుతూ.. కనిపించిన శునకాలన్నింటికీ పెడుతున్నారు.

గోవిందరాజులు స్ఫూర్తితో ముందుకు..

గోవిందరాజులు స్ఫూర్తితో మరి కొందరు యువత, మహిళలు కూడా మూగ జీవాలకు ఆహారం అందిస్తున్నారు. స్వయంగా వంట చేసుకొని వీధుల వెంట తిరిగి కుక్కలకు తిండి పెడుతున్నారు. శునకాలతోపాటు పక్షులు, బాతులకూ ఆహారం అందిస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ మూగజీవాల ఆకలి తీర్చుతూ ఆదర్శంగా నిలుస్తున్న కాకినాడ వాసులను పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇవీ చదవండి:

పర్వతారోహణకు ప్రోత్సాహమేదీ?

Trains cancelled: ప్రయాణికులు లేక.. 8 రైళ్లు తాత్కాలికంగా రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.