- Kanuma: పాడిపంటలు, పశువులతో రైతన్న అనుబంధాన్ని ఆవిష్కరించే పండుగ కనుమ
KANUMA: తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆప్యాయతానురాగాలతో పాటు.. పల్లె సొగసులను అందంగా ఆవిష్కరించే పండగ సంక్రాంతి. మూడు రోజుల పాటు ముచ్చటగా జరుపుకునే పండగలో చివరి వేడుక కనుమ..! అన్నదాతకు, వ్యవసాయానికి దన్నుగా నిలిచే వృషభరాజాలు, పాడి పశువుల పట్ల కృతజ్ఞత తెలిపే వేడుకే కనుమ..! పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- SANKRANTHI CELEBRATIONS:తెలుగు లోగిళ్లలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
SANKRANTHI CELEBRATIONS: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పల్లె, పట్టణాల్లోని ప్రతి ఇంటి ముంగిట రంగవల్లులు హరివిల్లుల్లా వెల్లివిరిశాయి. కొత్త కోడళ్లు, అల్లుళ్లు, బంధుమిత్రుల రాకతో ఊరూవాడా పండుగ శోభతో పరిఢవిల్లాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- kodi pandelu: సంక్రాంతి రెండో రోజూ జోరుగా సాగిన కోడిపందేలు
kodi pandelu: సంక్రాంతి రెండో రోజూ కోడి పందేలు జోరుగా సాగాయి. శిక్షణ శిబిరాల్లో రాటుదేలిన పందెకోళ్లు నువ్వానేనా అన్న రీతిలో తలపడ్డాయి. గిరిగీసి బరిలో నిలిచి పోట్లాడుకున్నాయి. ఆధునిక హంగులతో వందల కోడిపందేల బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Fire Accident: సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.20 కోట్ల ఆస్తినష్టం!
సికింద్రాబాద్‌లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటలను పది అగ్నిమాపక యంత్రాలతో ఆర్పేందుకు యత్నిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఘోర రోడ్డు ప్రమాదం- ఇద్దరు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం
Karnataka Road Accident: కర్ణాటక.. హవేరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రపంచవ్యాప్తంగా మరో 23 లక్షల మందికి కరోనా.. అమెరికాలో ఆగని ఉద్ధృతి
worldwide coronavirus cases: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 23లక్షల మందికి వైరస్ సోకింది. అమెరికాలో అదే ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 4 లక్షల కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. ఫ్రాన్స్‌లో 3 లక్షలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అగ్నిపర్వతం విస్ఫోటనం.. ఆ దేశాలకు సునామీ హెచ్చరిక!
Tonga Volcano: పసిఫిక్ ద్వీపకల్ప దేశమైన.. టోంగాలో సముద్రం అడుగున భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఆ ప్రాంతంలో సముద్రం ఉప్పొంగి.. భయానక వాతావరణం సృష్టించింది. ఈ పరిస్థితుల్లో టోంగా, ఫిజి, న్యూజిలాండ్ సహా పలు దేశాలకు.. టోంగా వాతావరణ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'నవ భారత్‌కు వెన్నెముకగా అంకుర సంస్థలు'
PM Modi On Startups: నవ భారత్‌కు వెన్నెముకగా అంకుర సంస్థలు ఉంటాయని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు సృజన, సాంకేతికతపరమైన పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Team india: టీమ్ఇండియా బోణీ.. దక్షిణాఫ్రికాపై ఘనవిజయం
Under-19 world cup: యువ భారత్ అదరగొట్టింది. అండర్-19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుపై గెలిచి, టోర్నీలో బోణీ కొట్టింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పుష్ప'పై కమల్ ప్రశంసలు.. అలరిస్తున్న 'స్వాతిముత్యం' గ్లింప్స్
సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పుష్ప, స్వాతిముత్యం, మన్మథలీల, శివకార్తికేయన్ కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.