ఎక్కడైనా ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం చూశాం. కానీ.. అధికార పార్టీలో ఉన్న ఓ కార్పొరేటర్ రోడ్లు బాగు చేయాలని నిరసన నిర్వహించడం.. ఎక్కడైనా చూశారా? ఈ నిరసన కార్యక్రమం ఎక్కడో కాదు.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని కడప నగరంలో జరిగింది. 48వ డివిజన్ కార్పొరేటర్ ఆనంద్ ఈ విధంగా నిరసన తెలిపారు. ఈ ఒక్క ఘటన చాలు.. రాష్ట్రంలో రహదారులు దుస్థితిని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టడానికి!
48వ డివిజన్ పరిధిలోని హోమియోపతి కళాశాల రోడ్డు మొత్తం ఇటీవల కాలంలో దెబ్బతింది. అడుగడుగునా గుంతలు ఉండడంతో.. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ.. అధికారులు మాత్రం దీనిని అస్సలు పట్టించుకోవడం లేదు. పలుమార్లు నగరపాలక కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ పరిష్కరించలేదని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పైగా.. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున వాహనాలను నడపడంతో.. ఈ మార్గం దెబ్బతిందని పేర్కొన్నారు. అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోకపోవడంతో అనివార్యంగా.. నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు సదరు కార్పొరేటర్ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును బాగుచేయాలని స్థానికులు సైతం కోరుతున్నారు.
ఇదీ చదవండి: