Tulsireddy: అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో సీఎం జగన్ మాట తప్పడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. గోల్డ్ బాధితుల సంబంధించి మన రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 19,43,121 లక్షల మంది ఉన్నారని.. వారికి అసలు రూ.3,945 కోట్లు ఇవ్వాలన్నారు.
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 13 లక్షల మందికి రూ.1,150 కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకంటించారని గుర్తు చేశారు. మిగిలిన వారికి త్వరగతిన నగదు ఇస్తానని చెప్పారని.. కానీ ఇప్పటివరకు రూ.905 కోట్లే ఇచ్చారన్నారు. 2022-23 బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితులకు పైసా పెట్టలేదని ఆరోపించారు.
Tulsireddy: ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆడపిల్లల వివాహానికి వైఎస్సార్ పెళ్లి కానుకగా రూ.లక్ష ఇస్తామని, బీసీలకు రూ.50 వేలు ఇస్తామని స్పష్టంగా చెప్పారని.. కానీ మూడేళ్లైనా మూడు పైసలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ మేరకు తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి: TDP Fires on YSRCP: కల్తీ సారా మరణాలకు అనారోగ్యాన్ని అంటగడుతున్నారు: తెదేపా