తిరుమల పేరును తొలగించాలనే ఆలోచన వస్తే ఎలా ఉంటుందో.. కడప పేరును తొలగిస్తే కూడా తమకు అంతే ఆవేదన కలుగుతోందని.. రాష్ట్ర విభజన హామీల సమితి నాయకుడు శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన కడప పేరును తొలగించి.. కేవలం వైఎస్సార్ జిల్లాగా పేరు పెట్టడాన్ని నిరసిస్తున్నామన్నారు. ఈ మేరకు కడప రాష్ట్ర విభజన హామీల సమితి ఆధ్వర్యంలో సీఎం జగన్‌కు రిజిస్టర్ పోస్టు ద్వారా ఉత్తరాలు పంపారు.
తొలుత ఉత్తరాలను దేవుని కడపలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవుని సన్నిధానంలో ఉంచారు. తిరుమల తిరుపతి తొలి కడప దేవునికడప ఎంతో ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అలాంటి కడప పేరును తొలగించి.. కేవలం వైఎస్సార్ పేరు పెట్టడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. గతంలో ఉన్నట్టుగా.. వైఎస్సార్ కడప జిల్లా పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. కడప పేరు తొలగించడం వల్ల జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకుని వైఎస్ఆర్ కడప జిల్లా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: