కడప జిల్లా పులివెందులలో చివరి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలోని 7 మండలాల్లో 109 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా... అందులో 91 సర్పంచ్ అభ్యర్థులు వైకాపా తరఫున ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు. తొండూరు, వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో పూర్తిస్థాయిలో వైకాపా కైవసం చేసుకుంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో 18 గ్రామ పంచాయతీలకు నేడు ఉదయం 6:30 నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. వీటికి పోలింగ్, కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఇదీ చదవండి: లోయలోపడి సైనికుడి మృతి