ETV Bharat / city

FRAUD: హోంగార్డుల ఎంపికపై నకిలీ జాబితా.. ఆకతాయిలపై కేసు! - add sp deva prasad

హోంగార్డుల ఎంపిక పేరుతో.. ఓ నకిలీ జాబితాను సామాజిక మాధ్యమాల్లో పెట్టినవారిని కడప పోలీసులు గుర్తించారు. వారిపై క్రిమినల్​ కేసు నమోదు చేశారు. ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా మోసగించేందుకు ప్రయత్నిస్తే తమకు తెలపాలని అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ సూచించారు.

kadapa police filed case over fraudsters
నకిలీ హోంగార్డు ఎంపిక జాబితా పెట్టిన ఆకతాయిలపై కేసు
author img

By

Published : Jul 11, 2021, 5:50 PM IST

హోంగార్డుల ఎంపిక పేరుతో ఓ నకిలీ జాబితాను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కడప జిల్లా అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ వెల్లడించారు. జిల్లాలో గత ఏడాది 75 సాంకేతిక హోంగార్డుల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులందరికీ నైపుణ్య పరీక్షలు సైతం నిర్వహించామన్నారు. అధికారికంగా ఎంపికైన హోంగార్డుల జాబితాను ఇంకా విడుదల చేయలేదని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు.

కానీ.. కొంతమంది ఆకతాయిలు హోంగార్డుల ఎంపిక జాబితా పేరుతో ఫేక్ లిస్ట్ ను సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు రెండు రోజుల కిందట గుర్తించామని తెలిపారు. ఈ మేరకు వారిపై కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. హోం గార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా చెబితే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. అలాంటి వ్యక్తులు తారసపడితే.. వారి వివరాలను పోలీసులకు అందించి ఫిర్యాదు చేయాలన్నారు.

ఇదీ చదవండి:

Viveka murder case: వివేకా హత్య కేసు విచారణ.. ఐదుగురిని ప్రశ్నించిన సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.