కడప జిల్లా బద్వేల్‌లో నకిలీ పట్టాల వ్యవహారంపై పోలీసుల సహకారంతో ఆర్డీవో ఆకుల వెంకటరమణ మెరుపు దాడులు నిర్వహించారు. నకిలీ పట్టాలు తయారు చేస్తున్న పక్కన రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి కొన్ని స్టాంపులు, పలు ప్రభుత్వ కార్యాలయాలు సీలు, అనుబంధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
"కష్టపడి డబ్బు సమకూర్చుకుని చివరలో నకిలీ పట్టాలు అమ్మితే దయచేసి కొనొద్దు. 100 రూపాయల స్టాంపు పేపర్లు కొన్నా చెల్లవు. కేవలం తహసీల్దార్ కార్యాలయం, లేదా ఆర్డీవో కార్యాలయాన్ని సంప్రదించారు. ఒకరోజు ఆలస్యమైనా ఫరవాలేదు. పది సంవత్సరాలు కష్టపడి కూడబెట్టిన డబ్బుకు 10 రోజులే ఎంక్వైరీ చేసి మొత్తం పోగొట్టుకుంటే గ్యాంబ్లింగ్ అవుతుంది. దయచేసి అలా ఎవరూ కొనొద్దు, అమ్మొద్దు." -వెంకటరమణ, ఆర్డీవో బద్వేలు
ఇదీ చదవండి: పోస్టుమార్టం చేసేందుకు లంచం అడిగిన డాక్టర్‌పై వేటు