దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ బాలల హక్కుల కమిషన్ పర్యటించి పిల్లల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తుందని కమిషన్ సభ్యులు డాక్టర్ ఆనంద్ తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 6 వేల కేసులు నమోదు కాగా... 4 వేల కేసులు పరిష్కరించామని, 2 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఆయా జిల్లాలో పర్యటిస్తున్న బృందం 33వ బెంచ్‌ను కడపలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఎవరైనా బాలల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. బాలల హక్కులను కాపాడటానికి జిల్లా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. సంరక్షణ కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. దేశంలో ఎక్కడైనా వారి సంరక్షణకు సంబంధించిన హక్కులను కాపాడటంలో అధికారులు విఫలమైతే సుమోటా కేసులు నమోదు చేస్తామని వెల్లిడించారు. చిన్నారుల సమస్యలపై తరచూ జిల్లా సమీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఇదీ చదవండి :