కడప జిల్లా పొద్దుటూరు తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు సుబ్బిరెడ్డి కొట్టాలలోని చౌడమ్మ ఆలయంలో ఆయన ప్రమాణం చేశారు. నందం సుబ్బయ్య హత్య తన చేతులతో చేపించలేదని.. తన నోటితో చెప్పలేదని ఆయన ప్రమాణం చేశారు. నందం సుబ్బయ్య హత్యకు గురవుతాడు అన్న విషయం తనకు ముందు తెలియదన్నారు. ముందే తెలిసి ఉంటే కచ్చితంగా ఆపేవాడినని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహం ధ్వంసం