ప్రభుత్వం మినీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ దేవి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం కడప కలెక్టరేట్ ఎదుట కార్యకర్తలతో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిటీల ద్వారానే అంగన్వాడీ కేంద్రాలు అభివృద్ధి అవుతాయని సూపర్ వైజర్ శివసుబ్బమ్మ పేర్కొన్నారు.
విజయనగరంలో నిరసన..
అర్హత కలిగిన మినీ అంగన్వాడీ వర్కర్లకు సూపర్ వైజర్ పోస్టులకు ఎంపిక చేయాలని కోరుతూ.. విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట మినీ అంగన్వాడీ వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా జీతాలివ్వాలని అంగన్వాడీ, హెల్పర్స్ రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు ఉమా మహేశ్వరి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: