రాయలసీమను కాపాడుకోవడానికే తెలుగుదేశం పార్టీ సదస్సులు నిర్వహిస్తోంది తప్పితే... వీటిలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్మోహన్రెడ్డి ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమకు నీటివాటాలు తేల్చకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 'రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం' అనే అంశంపై కడపలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కడప పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి ఆధ్యర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.
రాయలసీమలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని తెదేపా నేతలు ఆక్షేపించారు. 2006లోనే ట్రైబ్యునల్‌కు లేఖ అందజేసి రాయలసీమకు అన్యాయం చేయడానికి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారని మాజీమంత్రి అమర్నాథ్ ఆరోపించారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై చేసే పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.
ఇదీచదవండి.