కంటి సమస్యలున్న విద్యార్థులు, వృద్ధులను గుర్తించి వారికి ఆధునిక వైద్య పరీక్షలు నిర్వహించి, శస్త్ర చికిత్సలు చేయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా అన్నారు. వైఎస్ఆర్ కంటివెలుగు మూడో విడత కార్యక్రమాన్ని పాతకడపలో ఆయన ప్రారంభించారు. మొదటి రెండు విడతల్లో జిల్లాలో 13వేల మందికి కంటి పరీక్షలు అవసరమని గుర్తించామన్నారు. ఇప్పటికే 7 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేయగా... మార్చి చివరి నాటికి మిగిలిన 6 వేల మందికి కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 80 మందికి ఆధునిక కంటి శస్త్ర చికిత్సలు చేయించడానికి ఎల్వీ ప్రసాద్ వంటి ఆసుపత్రులకు సిఫారసు చేశామని మంత్రి చెప్పారు.
పాతకడపలో మూడో విడత 'కంటివెలుగు' ప్రారంభం - kadapa kanti velugu news
కంటి సమస్యలున్న విద్యార్థులు, వృద్ధులకు ఆధునిక వైద్య పరీక్షలు నిర్వహించి, శస్త్ర చికిత్సలు చేయించడానికి సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించే మూడో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన పాతకడపలో ప్రారంభించారు.

కంటి సమస్యలున్న విద్యార్థులు, వృద్ధులను గుర్తించి వారికి ఆధునిక వైద్య పరీక్షలు నిర్వహించి, శస్త్ర చికిత్సలు చేయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా అన్నారు. వైఎస్ఆర్ కంటివెలుగు మూడో విడత కార్యక్రమాన్ని పాతకడపలో ఆయన ప్రారంభించారు. మొదటి రెండు విడతల్లో జిల్లాలో 13వేల మందికి కంటి పరీక్షలు అవసరమని గుర్తించామన్నారు. ఇప్పటికే 7 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేయగా... మార్చి చివరి నాటికి మిగిలిన 6 వేల మందికి కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 80 మందికి ఆధునిక కంటి శస్త్ర చికిత్సలు చేయించడానికి ఎల్వీ ప్రసాద్ వంటి ఆసుపత్రులకు సిఫారసు చేశామని మంత్రి చెప్పారు.
ఇదీ చూడండి: అంధత్వ నివారణే .... వైయస్ఆర్ కంటివెలుగు ధ్యేయం !