కడప జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పోలీసులను ఆదేశించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్‌జోన్‌లు, బఫర్ జోన్‌లుగా ప్రకటించారు. అక్కడ రాకపోకలను పూర్తిగా నిషేధించి నిఘా పెంచారు. జిల్లా ప్రజల సహకారంతో కరోనాను తప్పనిసరిగా తిప్పికొడతామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అంటున్నారు.
ఇదీ చదవండి: కరోనా గురించి అంతుచిక్కని 5 రహస్యాలివే..