RTC bus stand closed: కడప ఆర్టీసీ అధికారులు నగరపాలక సంస్థకు అద్దె చెల్లించలేదనే కారణంతో ఉదయం నాలుగు గంటల నుంచి బస్సులను పాత బస్టాండ్‌లోకి అనుమతించకుండా నగరపాలక అధికారులు బస్టాండ్‌ను మూసేశారు. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం రోడ్లపై పడిగాపులు కాస్తూ... అవస్థలు పడ్డారు. ముఖ్యమంత్రి, ఆర్టీసీ స్టేట్ ఛైర్మన్ సొంత జిల్లా కావడం గమనార్హం. కడప పాత బస్టాండ్‌ను నగరపాలక అధికారులు నిర్మించారు. అక్కడ ఆర్టీసీ బస్సులను పార్కింగ్ చేసేందుకు ప్రతినెల ఆర్టీసీ అధికారులు... నగరపాలక సంస్థకు అద్దె చెల్లిస్తారు.
కానీ గత 2013 నుంచి ఆర్టీసీ అధికారులు నగరపాలక సంస్థకు దాదాపు రెండు కోట్ల 30 లక్షల రూపాయలు అద్దె చెల్లించలేదు. గతంలో నగరపాలక అధికారులు పట్టించుకోకపోవడంతో ఇది పెరుగుతూ పోయింది. కొత్తగా వచ్చిన సూర్య సాయి ప్రవీణ్ కమిషనర్ ఆర్టీసీ అధికారులకు అద్దె చెల్లించాలని సూచించారు. కానీ ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడంతో ఇక చేసేది లేక ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి పాత బస్టాండ్‌లోకి బస్సులను పంపకుండా బస్టాండును మూసేశారు. ఇలా చేయడం సరికాదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇవీ చదవండి:
Pills off debt: శాసనసభ పర్యవేక్షణ పాత్ర నిర్వీర్యమయ్యే ప్రమాదం.. కాగ్
CAG reports: ఏపీని ముంచబోతున్న అప్పులు.. కాగ్ నివేదికల్లో వాస్తవాలు