Sivashankar Reddy bail: వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కడప కోర్టు. కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఒకరోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. రేపు (గురువారం మే 26) ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బెయిల్‌కు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. రేపు కడపలో శివశంకర్ రెడ్డి కుమారుడి ఆస్పత్రి ప్రారంభం కానుంది ఈ కార్యక్రమానికి శివశంకర్ రెడ్డి హాజరుకానున్నారు.
ఇవీ చదవండి :