నగరంలో శుక్రవారం అరగంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ నీటమునిగి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కోర్టు ఎదుట, పాత బస్టాండ్, అక్కయ్య పల్లి, నకాష్ వీధి, భాగ్యనగర్ కాలనీ, ప్రకాష్ నగర్, మృత్యుంజయ కుంట తదితర ప్రాంతాల్లోకి నీరు చేరడం వల్ల ప్రజలు అవస్థలు పడ్డారు. మురికి కాలువలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. నగర వీధుల్లో మోకాల్లోతుగా వర్షపు నీరు వచ్చి చేరింది.
ఇదీ చదవండి :
వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు: వాతావరణ కేంద్రం