కడప జిల్లా కోర్టు ఆవరణలోని పోలీస్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్.. ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మంగళవారం రాత్రి పోలీస్ కంట్రోల్ కార్యాలయానికి విధుల నిమిత్తం వచ్చారు. ఇవాళ ఉదయం కోర్టు సిబ్బంది చూసేసరికి విజయ కుమార్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.
వెంటనే విషయాన్ని ఒకటో పట్టణ పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోలీసులు పరిశీలించారు. గత కొంత కాలంగా విజయ్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: