కడప జిల్లాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. జీవనోపాధి కోసం వలస వెళ్లి అష్టకష్టాలు పడి స్వరాష్ట్రానికి చేరుకున్న జిల్లా వాసులను కరోనా వెంటాడుతోంది. ఈనెల 7న కువైట్ నుంచి రెండు విమానాల్లో కడప జిల్లాకు చెందిన 540 మంది వచ్చారు. వీరిని రాజంపేటలోని 3 క్వారంటైన్ సెంటర్లతో పాటు బద్వేలు, రైల్వేకోడూరు, పుల్లంపేటలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. వీరందరికీ కడప నుంచి వచ్చిన నిపుణులు కరోనా పరీక్షలు నిర్వహించారు.
రాజంపేట అన్నామాచార్య ఇంజినీరింగ్ కళాశాలలోని క్వారంటైన్ సెంటర్లో 134 మందికి పరీక్ష నిర్వహించగా వారిలో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. జవహర్ నవోదయ పాఠశాలలోనీ క్వారంటైన్లో 75 మందికి పరీక్ష చేయగా... ఒకరికి పాజిటివ్ వచ్చింది. కువైట్ నుంచి అంతా కలిసే వచ్చాం.. కలిసి తిరిగాం... కానీ ఇప్పుడు కొందరికి పాజిటివ్ రావటంతో భయంగా ఉందంటూ మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి