కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక(badvel by-poll) అసెంబ్లీ స్థానానికి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొట్టిపోగు కమలమ్మ(congress candidate kamalamma) నామినేషన్ వేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌తో కలిసి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్‌కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. కడప జిల్లా(kadapa district) నిండుకుండలా మారిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని శైలజానాథ్ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఊరుకోబోమని హెచ్చరించారు.
పోటీలో ఉన్నాం...
వైకాపా అసమర్థత పాలనను, అన్యాయాన్ని ప్రశ్నించడానికే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్(shailajanath) స్పష్టం చేశారు. రాష్టంలో పరిపాలన రోజురోజుకీ దారుణంగా తయారువుతోందన్న ఆయన..ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు(drugs) దొరుకుతున్నాయని..,శాంతి భద్రతలు క్షీణించాయని ఆక్షేపించారు. స్థానిక ఎన్నికల్లో కడప జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగాయో చూశామని..దౌర్జన్యాలకు, దాడులకు కాంగ్రెస్ పార్టీ(congress party) భయపడదన్నారు. విశాఖ ఉక్కు, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ ఆగాలంటే..ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతోందన్నారు.
భాజపా అభ్యర్థి ఎవరంటే..
బద్వేలు ఉప ఎన్నికలో (badvel by- election) భాజపా అభ్యర్థిగా పనతల సురేష్‌ను ఎంపిక చేశారు. భాజపా అభ్యర్థి సురేష్.. శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. పెనగలూరు మండలానికి చెందిన సురేష్.. 2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏబీవీపీ తరఫున, భాజపా తరఫున జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన సురేష్ ఉన్న పేరు ప్రతిష్ఠలు.. ఎన్నికల్లో కలిసి వస్తాయని భావిస్తున్నారు.
జనసేన, తెదేపా దూరం
బద్వేలు ఉపఎన్నికలో జనసేన(janasena) పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) వెల్లడించారు. మరణించిన ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇచ్చినందున మానవతా దృక్పథంతోనే బద్వేలులో పోటీ చేయడం లేదన్నారు. నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బద్వేలు ఉపఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా(TDP) నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు(chandrababu) అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశం(polit bureau meeting)లో..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే అధికార వైకాపా టికెట్ ఇవ్వటంతో..ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించినట్లు తెదేపా తెలిపింది.
ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలి
ఉపఎన్నికల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishnareddy) పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికపై మండలాల వారీగా బూత్ కన్వీనర్లతో ఆయన సమావేశం(meeting with booth officers) నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ బద్వేలు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నారని అన్నారు. ఎన్నికను సీరియస్‌గా తీసుకొని..ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు.
లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి ప్రభుత్వం పని చేస్తోందని..మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 90 శాతానికి పైగా అమలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(minister peddireddy ramachandrareddy) అన్నారు. బద్వేలు ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధను(YCP candidate sudha) అత్యధిక మెజార్టీ(mejority)తో గెలిపించాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్(CM Jagan)పై మీకున్న అభిమానం తెలిపేందుకు ఇదొక అవకాశంగా తీసుకోవాలన్నారు. లక్ష ఓట్ల మెజారిటీతో వైకాపా అభ్యర్థిని గెలిపించి జగన్ రుణం తీర్చుకోవాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. బూత్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు, అంజాద్ బాషా, నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాశ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనుబంధ కథనాలు...
- Badwel By-Poll: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే బద్వేలులో పోటీ: శైలజానాథ్
- Badwel By-Poll: 'లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యం'..వైకాపా అభ్యర్థి నామినేషన్
- Somu Veerraju: 'రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని భాజపా ప్రోత్సహించదు'
- badvel by- election: బద్వేలు ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఎవరంటే..?
- BY-POLL : బద్వేలు ఉపఎన్నికను బహిష్కరించిన గ్రామస్థులు