వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడిచే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జీవో 22 తీసుకువచ్చారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కడప నగరంలో కాంగ్రెస్ చేపట్టిన సంతకాల సేకరణలో ఆయన సంతకం చేశారు.
దేశవ్యాప్తంగా 2 కోట్ల మందితో సంతకాలు సేకరించి కేంద్రానికి పంపుతామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రైతులు వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం అంటే... ఉచిత విద్యుత్‌కు చరమగీతం పాటినట్లే అని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం రైతులను మోసం చేసేందుకు వ్యవసాయ బిల్లులను తెచ్చిందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2004లో రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ కొనసాగించడమే కాకుండా... ఇప్పుడు పెట్టిన వ్యవసాయ మీటర్లు తొలగించే ఫైలుపైనే తొలి సంతకం చేస్తామని తులసిరెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: