ETV Bharat / city

గండికోట జలాశయం ముంపు బాధితుల దీనస్థితి - kadapa news

కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో పది రోజులుగా నిర్వాసితులు ఆందోళనకు దిగారు. దీనికి ప్రధాన కారణం ...నిర్వాసితులను ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించడం. కనీసం ఏడాదైనా గడువు ఇవ్వకుండా గ్రామాన్ని ఖాళీ చేయమంటే ఎలాగని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

Concern of Gandikota Reservoir flood victims
గండికోట జలాశయం ముంపు బాధితుల దీనస్థితి
author img

By

Published : Sep 13, 2020, 7:40 AM IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో గండికోట జలాశయం కింద ముంపునకు గురవుతున్న తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితులను కష్టాలు చుట్టుముట్టాయి. గ్రామంలో ఎవరితో మాట్లాడినా కన్నీరు పెట్టుకుంటున్నారు. కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు ముంపు బాధితులు పరిహారం, పునరావాసం కోరుతూ గత పది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఇళ్ల నిర్మాణానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గండికోట జలాశయంలో 12.5 టీఎంసీల నీటిని నిల్వ చేస్తుండటంతో తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోకి వెనుక జలాలు ప్రవేశించాయి. ఇప్పటికే బీసీ కాలనీలోని కొన్ని ఇళ్లను నీళ్లు చుట్టుముట్టాయి. ఎస్సీ కాలనీలోని ఇళ్ల సమీపానికీ కృష్ణా జలాలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఈ రెండు కాలనీల్లోని ప్రజలకు పరిహారం పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదు. కొందరు పరిహారం తీసుకున్నా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం అందించే పరిహారం తీసుకున్నా.. ఇళ్లు వెంటనే ఖాళీ చేయాలనే నిబంధన గుర్తుకొస్తే కాళ్లు, చేతులు ఆడట్లేదని బీసీ కాలనీలో ఉంటున్న భారతి ఆందోళన వ్యక్తం చేశారు. పునరావాస కాలనీల్లో పనులు నత్తనడకన జరుగుతున్నాయని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వసతి కల్పిస్తాం...

తాళ్లప్రొద్దుటూరు ఎస్సీ, బీసీ కాలనీల్లో నివసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయించాలని నిర్ణయించాం. అప్పుడే గండికోట జలాశయంలో 16 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంటుంది. పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. అప్పటివరకు నిర్వాసితులు బాడుగ ఇళ్లలో ఉండాలి. బాడుగకు ఇళ్లు లభించనివారికి మేం వసతి కల్పించడానికి ప్రణాళిక రూపొందించాం. ఇప్పటివరకు గ్రామంలో 1100 మందికి పరిహారం పంపిణీ చేశాం. త్వరలోనే ఎస్సీ, బీసీ కాలనీల్లోని నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో పరిహారం పంపిణీ చేస్తాం.

- నాగన్న, జమ్మలమడుగు ఆర్డీవో

  • పాముల భయం

మాకు ఎక్కడా సెంటు స్థలం లేదు. ఉన్నదల్లా ఇల్లే. కూలి పనులకు వెళ్తేనే జీవనం సాగుతుంది. ఇంటి చుట్టూ నీళ్లతో పాములు, విషపురుగులు వస్తున్నాయి. మాకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల పరిహారం అందింది. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి పోతాం? ఇంటి నిర్మాణానికి సమయం ఇవ్వాలి.

- బావమ్మ, బీసీ కాలనీ, తాళ్లప్రొద్దుటూరు

  • వంకల పక్కన పునరావాసం

రిహారం తీసుకుంటే వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. పునరావాస కాలనీలో మౌలిక వసతులు లేవు. మాకు వంకల పక్కన పునరావాసం కల్పించడంతో భవిష్యత్తులో వరదలొస్తే మళ్లీ ముంపు ప్రమాదం ఉంది. ప్రస్తుతం మా కోడలు గర్భిణి. ఇలాంటి సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళనగా ఉంది.

- నారాయణమ్మ, ఎస్సీ కాలనీ, తాళ్లప్రొద్దుటూరు

ఇదీ చదవండి: రాష్ట్రంలో క్రమంగా మొదలవుతున్న కార్యకలాపాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.