ETV Bharat / city

cm jagan kadapa tour: నేటి నుంచి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన - undefined

కడప జిల్లాలో ఇవాళ్టి నుంచి ముఖ్యమంత్రి జగన్‌.. పర్యటించనున్నారు. 3 రోజుల పర్యటనలో 2వేల214కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

cm jagan kadapa tour
cm jagan kadapa tour
author img

By

Published : Dec 23, 2021, 5:24 AM IST

ముఖ్యమంత్రి జగన్.. నేటి నుంచి 3 రోజుల పాటు తన సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం పదిన్నరకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11గంటల 15 నిమిషాలకు కడప ఎయిర్‌పోర్టుకు జగన్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రొద్దుటూరు మండలం బొల్లవరం గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రొద్దుటూరులో మండలంలో దాదాపు 516కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం శుంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో జగన్‌ పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బద్వేలు నియోజకవర్గం గోపవరం చేరుకుంటారు. గోపవరంలో 2వేల మందికి ఉపాధి కల్పించేలా 956 కోట్ల రూపాయల పెట్టుబడితో సెంచురీఫ్లై పరిశ్రమకు...సీఎం జగన్‌ శంకుస్ధాపన చేస్తారు. అక్కడి నుంచి సీకేదిన్నె మండలం కొప్పర్తి చేరుకుని... వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ ప్రారంభిస్తారు. ఇక్కడ 613కోట్ల రూపాయలతో తలపెట్టిన పరిశ్రమలకు శుంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో రాత్రి బస చేస్తారు.

ఈనెల 24వ తేదీ ఉదయం వైఎస్సార్ ఘాట్‌ వద్దకు చేరుకుని దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఇడుపులపాయలోని.. ప్రార్ధనా మందిరానికి చేరుకుని అక్కడ నిర్వహించే ప్రార్ధనల్లో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందుల పరిధిలోని ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పార్క్‌లో ఆదిత్య బిర్లా యూనిట్‌కు సీఎం శంకుస్ధాపన చేస్తారు. ఆ తర్వాత వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేస్తారు. అక్కడే జరిగే బహిరంగ సభలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తర్వాత మార్కెట్‌ యార్డులో అభివృద్ది కార్యక్రమాలతో పాటు.... రాణితోపు వద్ద ఆక్వాహబ్‌ను సీఎం ప్రారంభిస్తారు.

ఈనెల 25న పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్‌ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనలలో సీఎం పాల్గొంటారు. చర్చి కాంపౌండ్‌లో ఏర్పాటుచేసిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని గన్నవరం బయలుదేరుతారు.

ఇదీ చదవండి: TTD TICKETS: జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు.. ఇవాళ, రేపు విడుదల చేయనున్న తితిదే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.