రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు(viveka murder case) విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. వరుసగా 29వ రోజూ విచారణలో మరో ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందుల పెట్రోల్ బంక్ యజమాని సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు దస్తగిరిని సీబీఐ(CBI) అధికారులు పలుమార్లు విచారించారు.
వివేకా హత్య కేసును సవాలుగా తీసుకున్న సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. గత 28 రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. ఈ కేసులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురికాగా.. మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో(pulivendula) అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: curfew: కర్ఫ్యూ సడలింపుపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారా?