ETV Bharat / city

సీపీఎస్ రద్దు చేయాలని.. యూటీఎఫ్ ఆధ్వర్యంలో​ బైక్‌ ర్యాలీలు

UTF Rally: పలు ప్రాంతాల్లో యూటీఎఫ్​ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సీపీఎస్ రద్దు చేయకుంటే మిలిటెంట్ తరహా ఉద్యమం చేపడతామని యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించారు.

utf bike rally
యూటీఎఫ్​ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ
author img

By

Published : Apr 21, 2022, 12:59 PM IST

యూటీఎఫ్​ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

UTF Rally: సీపీఎస్​ రద్దు చేయకుంటే మిలిటెంట్ తరహా ఉద్యమానికి...శ్రీకారం చూడతామని యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సీపీఎస్​ రద్దు చేయాలంటూ కడపలో బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఆయన... ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యమాన్ని అణచివేసినంత మాత్రాన తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

"సీపీఎస్​ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చకపోగా నిర్బంధాలతో ఉద్యమాన్ని అణిచివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగులకు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నేరవేర్చలేదు. సీపీఎస్​ను కూడా నెరవేర్చే ప్రయత్నం చేయకుండా కాలయాపన కమిటీలను, కాలయాపన చర్చలు చేస్తున్నారు. సీపీఎస్​ను రద్దు చేయడం తప్ప మరొక అంశాన్ని మేము అంగీకరించేది లేదు. త్వరలో సీపీఎస్​పై ఎలాంటి ప్రతిపాదన రాకపోతే.. కచ్చితంగా సీపీఎస్​కు సంబంధించి మిలిటెంట్ తరహా ఉద్యమం చేపడతాం" -వెంకటేశ్వర్లు, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

UTF Rally: సీపీఎస్ రద్దు పోరు గర్జనలో భాగంగా కాకినాడ జిల్లా తునిలోనూ అంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ప్రదర్శన జరిగింది. సీపీఎస్​ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చాపురం నుంచి విజయవాడ ప్రదర్శన నేపథ్యంలో.. తుని నుంచి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తుని నుంచి కాకినాడ వరకు ప్రదర్శన చేపట్టారు.

ఇదీ చదవండి: సీఎం జగన్​ పర్యటన దృష్ట్యా.. తెదేపా నేతల గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.