ETV Bharat / city

కొప్పర్తి పారిశ్రామికవాడపై చిగురిస్తున్న ఆశలు..! - industrial park of kadapa

దశాబ్ద కాలంగా ఎలాంటి పురోగతి లేకుండా నిర్మానుష్యంగా ఉన్న కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడకు మహర్ధశ రానుంది. ఇప్పటికే 20 ఫార్మా కంపెనీలు, 8 బేరియం పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ "నిక్ డిట్" రూ. వెయ్యి కోట్లతో వెయ్యి ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

kopparthi mega industrial park of kadapa

author img

By

Published : Jul 11, 2020, 1:10 PM IST

రాజోలి వీరారెడ్డి, పరిశ్రమలశాఖ ప్రభుత్వ సలహాదారు

కడప జిల్లాను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి 2007లో చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి వద్ద ఏపీఐఐసీ ద్వారా ఏడు వేల ఎకరాలను సేకరించారు. ఇప్పటివరకు ఆరు చిన్న పరిశ్రమలు మినహా... పెద్ద కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కాలేదు. దాదాపు దశాబ్ధ కాలం పాటు కొప్పర్తి పారిశ్రామికవాడ నిర్మానుష్యంగా ఉంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం... సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో కొప్పర్తి పారిశ్రామికవాడ అభివృద్ధి దస్త్రాలు చకచకా కదులుతున్నాయి.

'నిక్ డిట్' సముఖత

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన.. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్​మెంట్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ట్రస్టు(నిక్ డిట్) ఆధ్వర్యంలో కొప్పర్తి పారిశ్రామికవాడలో వెయ్యి కోట్ల రూపాయలతో కారిడార్​ను అభివృద్ధి చేయడానికి సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో నిక్ డిట్ సంస్థ పారిశ్రామిక కారిడార్​ను అభివృద్ధి చేస్తుండగా... ఏపీలో కడప, నెల్లూరు జిల్లాల్లో అభివృద్ధి చేయడానికి సుముఖత చూపినట్లు సమాచారం.

కేంద్రానికి ప్రతిపాదనలు

కొప్పర్తి పారిశ్రామికవాడలో వెయ్యి ఎకరాల్లో రహదారుల విస్తరణ, మంచినీరు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. చెన్నై-విశాఖ కారిడార్ అభివృద్ధిలో భాగంగా కొప్పర్తిలో మరో 3 వేల ఎకరాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. వీటితోపాటు బెంగళూరుకు చెందిన "నేషనల్ ఏరో స్పేస్ ల్యాబొరేటరీ" సంస్థ కూడా కొప్పర్తిలో అడ్వాన్స్ టెక్నాలజీతో కాంపోజిట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. ఈ పరిశ్రమ ఇక్కడ వస్తే... విమానాలు, హెలికాప్టర్లకు వాడే అల్యూమినియం ప్లేట్లు, విడి భాగాలను చాలా తక్కువ బరువుతో తయారు చేయడానికి కాంపోజిట్ టెక్నాలజీ పరిశ్రమ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఏపీఐఐసీ ఆద్వర్యంలో రూ.200 కోట్లతో కొప్పర్తిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించారు. దీనిద్వారా జిల్లాలోని మామిడి, అరటి, బత్తాయి, బొప్పాయి, జామ, దానిమ్మ వంటి పళ్లను రైతులు ప్రాసెసింగ్ చేసుకుని విక్రయించుకునే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది.

ధరలకు రెక్కలు..!

కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఏపీఐఐసీ సేకరించిన 7 వేల ఎకరాల్లో ప్రస్తుతం 1500 ఎకరాల్లో పరిశ్రమలు పెట్టడానికి అనువుగా ఏర్పాటు చేశారు. కానీ ఏపీఐఐసీ నుంచి పారిశ్రామికవేత్తలు భూములు కొనుగోలు చేయాలంటే ధరలు భారీగానే ఉన్నాయి. ఇక్కడ ఎకరా భూమి 18 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఉంది. ఎలాంటి అభివృద్ధి చేయకుండా కంపచెట్లు మొలిచినా చదును చేయకుండా ఇచ్చే భూమి ఎకరా 18 లక్షలతో ఏపీఐఐసీ విక్రయిస్తోంది. కొంతమేరకు రహదారులు, భూములు చదును చేసి ఇచ్చే భూమి ఎకరా 25 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉండటంతోనే గత పదేళ్లుగా ఇక్కడికి పరిశ్రమలు రాకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే భూముల ధరను సగానికి సగం తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్లాయి. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా వెళ్లింది. కొప్పర్తిలో ఎకరా భూమి ధర 10 లక్షలలోపు ఉండే విధంగా చూడాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

కొప్పర్తి పారిశ్రామిక వాడకు ఒంటిమిట్ట మండలంలోని సోమశిల వెనక జలాల నుంచి నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమశిల వెనక జలాల నుంచి 0.6 టీఎంసీ నీటిని కొప్పర్తికి కేటాయిస్తూ జలవనరులశాఖ 2019 నవంబరు 11న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సోమశిల నుంచి పైపులైన్ల ద్వారా కొప్పర్తికి నీటిని తరలించేందుకు దాదాపు 200 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడానికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఆగస్టులో టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదీ చదవండి:

'గత వందేళ్లలో కరోనానే అతిపెద్ద సంక్షోభం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.