ETV Bharat / city

అక్రమ కట్టడాలపై అధికారుల ఆగ్రహం!

అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలపై అధికారులు కన్నెర్ర చేశారు.

akrma kattadalu
author img

By

Published : Jul 1, 2019, 10:55 PM IST

ప్రొద్దుటూరు మున్సిపల్ స్టాల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు పురపాలక శాఖ నడుం బిగించింది. అక్కడి శివాలయం నుంచి కోనేటి కాల్వ వీధికి వెళ్లే ప్రధాన మార్గం వరకు అక్రమ నిర్మాణాలున్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొత్త మార్కెట్ షాపు రూముల‌కు ముందు, వెనుక దుకాణాదారులు అనుమ‌తులు లేకుండా కట్టడంతో పట్టణం నడిబొడ్డున ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఈ విషయమై మున్సిపల్ కౌన్సిల్ లో కొంతకాలంగా చర్చలు జరిగాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. జేసీబీ సహాయంతో అక్రమంగా నిర్మించిన షాపులను తొలగిస్తున్నట్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. కొందరు పండ్ల దుకాణాదారులు మాత్రం తమకు ప్రత్యామ్నాయం చూపే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు.

అక్రమ కట్టడాలు

ఇది చూడండి:తాడేపల్లిలో యాగం.. హాజరైన సీఎం

Intro:AP_TPG_06_01_CURRENT_WATER_KOSAM_DHARNA_AVB_AP10003నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు రిపోర్టర్ : పి. చింతయ్య సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా (  ) మంచి నీరు విద్యుత్తు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టారు.

Body:జంగారెడ్డిగూడెం మండలం సీతంపేట గ్రామంలో ప్రభుత్వ నిర్మించి ఇచ్చిన కాలనీలో గత 13 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని అక్కడ తాగునీరు గాని విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చీకటి పడితే చాలు ఆ ప్రాంతమంతా అంధకారం అలముకుంది బయటకు రావాలంటేనే బిక్కుబిక్కుమంటూ రావాల్సిన దుస్థితి నెలకొందని వారంతా వాపోయారు. తమ పిల్లలు చదువుకోలేక బయటికి వస్తే పాములు పురుగు పుట్రా కరిసి ఆస్పత్రి పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Conclusion: ఓట్ల కోసం ప్రజా ప్రతినిధులు ప్రతి ఎన్నికల్లో వస్తారని కానీ మా సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన తమ గోడు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరారు. బైట్ .లక్ష్మి గ్రామస్తులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.