ETV Bharat / city

Government Job: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య - suicide

Youngster Suicide : ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షలా మారిన ఈ రోజుల్లో ఆ యువకుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అందుకోసం శిక్షణ కూడా తీసుకున్నాడు. కానీ ఉద్యోగం రావడం లేదనే మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడప జిల్లా ప్రకాష్ నగర్​లో చోటుచేసుకుంది.

Government job
Government job
author img

By

Published : Sep 21, 2022, 12:03 PM IST

Suicide: కష్టపడి డిగ్రీ వరకు చదివాడు. ఉద్యోగం కోసం వివిధ రకాల కోచింగ్​లు తీసుకున్నాడు. పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు. ఎక్కడ ఉద్యోగం దొరకకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడప ప్రకాష్ నగర్​లో చోటుచేసుకుంది. ప్రకాష్ నగర్ కు చెందిన భాను ప్రకాష్ (24) డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ ముగిసిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకున్నాడు.

ఇంట్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకొని పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు. కానీ దరఖాస్తు చేసిన ప్రతి ఉద్యోగంలో భాను ప్రకాష్​కు నిరాశే ఏదురైంది. అప్పుడప్పుడు తనకు ఉద్యోగం రావడం లేదంటూ తాను ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పేవాడని తెలుస్తోంది. వారు ప్రకాష్​ అలాంటి పని చేయవద్దని ధైర్యం చెప్పేవారు. గత రాత్రి జీవితం మీద విరక్తి చెందిన భాను ప్రకాష్ చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.