అమరావతి ప్రాంతంలో తనని లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వక దాడులు చేస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. నిన్న అమరావతి రథోత్సవానికి వెళ్తుండగా... తన కాన్వాయ్‌లోని వాహనం ఓ రైతును ఢీ కొట్టిన ఘటనపై మాట్లాడిన ఆయన... ఆ రైతుకు పెద్దగా గాయాలేమీ అవలేదని... వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేయించానన్నారు. అయితే రథోత్సవానికి తిరిగొస్తుండగా తనపై, తన అనుచరులపై కారం చల్లుతూ, కర్రలతో కార్లపై కొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఐకాసా ముసుగులో ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: బంధం భారమైంది... బతుకు బరువైంది