ETV Bharat / city

సొంత గ్రామాలకు.. వైకాపా బాధితులు!

author img

By

Published : Sep 11, 2019, 5:34 PM IST

గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన శిబిరం నుంచి వైకాపా బాధితుల తరలింపు ప్రక్రియ పూర్తయింది. ఆర్డీవో భాస్కర్‌రెడ్డి బాధితుల వివరాలు నమోదు చేసుకొని వారిని సొంత గ్రామాలకు పంపారు. బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సొంత గ్రామాలకు వైకాపా బాధితులు
సొంత గ్రామాలకు వైకాపా బాధితులు

గుంటూరులోని తెదేపా శిబిరం నుంచి వైకాపా బాధితులను వారి సొంత గ్రామాలకు తరలించే ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు. 162 మంది వైకాపా బాధితులను అధికారులు.. వారి వారి సొంత గ్రామాలకు పంపించారు. అందరి ఇబ్బందులను రికార్డు చేసుకున్నామని ఆర్డీవో భాస్కర్‌రెడ్డి తెలిపారు. వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామాల్లో దాడులు జరగకుండా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశామని వివరించారు. ఇరువర్గాలతో మాట్లాడి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. వివాదాలకు అసలు కారణాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరిస్తామన్న ఆర్డీవో... పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి

అధికారులకు అభినందనలు తెలిపిన సీఎం... ఎందుకంటే?

Intro:స్క్రిప్ట్ గ్రామస్థాయిలో ప్రజల కు మంచి పాలన అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు పల్లెబాట కార్యక్రమంలో భాగంగా రాయచోటి నియోజకవర్గం లోని రామాపురం మండలం గువ్వల చెరువు లో బుధవారం ఆయన పర్యటించారు ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదని అడిగి తెలుసుకున్నారు గ్రామాలలో పారిశుధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రజారోగ్య శాఖ అధికారులు ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టాలని సూచించారు గ్రామ వాలంటీర్లు సమస్యలను గుర్తించి పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకు రావాలని పేర్కొన్నారు ప్రతి ఇంటికి తాగునీరు రోడ్లు వసతి విద్యుత్తు వంటి సౌకర్యాల కల్పించిన పోతే రాబోయే ఎన్నికల్లో ఓటు అడగమన్నారు ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేసే బాధ్యత తాను తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చామన్నారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్న చిన్న గొడవలను తెలుగుదేశం పార్టీ రాజకీయ రంగు పులుముకున్న ని విమర్శించారు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి పార్టీ మారాలని బెదిరింపులకు పాల్పడిన విషయాలను తేదేపా వారు అంగీకరించాలి అన్నారు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో చిచ్చుపెట్టి లా అండ్ ఆర్డర్ ను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పల్నాడు లో ప్రజలే బయటకొచ్చి ఎరపతినేని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావులు చేసిన అరాచకాలను చెబుతున్నారన్నారు స్పీకర్ పదవిలో ఉండి అసెంబ్లీ ఫర్నిచర్ను దొంగలించిన నీచ సంస్కృతి శివ ప్రసాద్ రావు ది కాగా అ ఎరపతినేని శ్రీనివాస రావు మైనింగ్ మాఫియాకు ఆజ్యం పోశార నీ చెప్పారు తెదేపా హయాంలో చేసిన పాపాలను బయటపెడితే తలెత్తుకు తిరిగ లేరన్నారు తెదేపా ప్రభుత్వం సర్వనాశనం చేసిన వ్యవస్థలను చక్క పెట్టేందుకే తమ ప్రభుత్వానికి సమయం సరిపోతుందన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పని లేక క ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో చిచ్చు రేపే కార్యక్రమాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామాలలో ప్రశాంతత కోరుకుంటూ అభివృద్ధిపై దృష్టి పెట్టారు ఓర్వలేనితనం తోనే తెదేపా చేస్తున్న రాజకీయ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Body:బైట్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్

Conclusion:బైట్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ రాయచోటి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.