గుంటూరు నగరంలోని ఓ పురపాలక పాఠశాలకు వైకాపా రంగులు వేశారు. నెహ్రునగర్ ఏడో లైన్లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు రెండు రోజుల క్రితం రంగులు వేసే పని మొదలు పెట్టగా ఇవాళ పూర్తైంది. నెహ్రు నగర్లో వార్డు సచివాలయం కోసం మున్సిపల్ పాఠశాల పై అంతస్తులోని గదుల్ని తీసుకున్నారు. సచివాలయానికి రంగులు వేసే క్రమంలో మొత్తం భవనానికి పూసేశారు. విద్యార్థులకు చదువులు చెప్పేచోట వార్డు సచివాలయం ఏర్పాటు చేయటం కూడా ఒకింత ఇబ్బందని పలువురు అంటున్నారు. భవనాలు దొరక్క ఇక్కడ ఏర్పాటు చేసినా... ఆ రంగులు వేసే కార్యక్రమాన్ని వార్డు సచివాలయం కోసం తీసుకున్న పై అంతస్తు వరకే పరిమితం చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలలకు తెలుపు లేదా క్రీం కలర్ మాత్రమే ఉపయోగించాలి. దీనికి సంబంధించి పాఠశాల ఉపాధ్యాయులు గానీ, నగరపాలక సంస్థ అధికారులు ఇంకా స్పందించలేదు.
ఇదీ చదవండి