ETV Bharat / city

కుమారుడిని దూరం చేశారని తల్లి ఆత్మహత్యాయత్నం - Mother suicide attempt News

కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి... బతికే అవకాశం కంటే.. చావే ఆమెకు అనుకూలంగా అనిపించింది. ఎంతో ధైర్యం చేసి ప్రాణం తీసుకోవడానికి రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ మహిళను గుంటూరు అర్బన్ పోలీసులు రక్షించారు. కౌన్సిలింగ్ ఇచ్చి స్వస్థలానికి పంపించినట్లు గుంటూరు పశ్చిమ డిఎస్పీ సుప్రజ తెలిపారు.

తల్లి ఆత్మహత్యాయత్నం
తల్లి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Mar 27, 2021, 4:39 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మోటుపల్లి రమాదేవి తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రే ఆమెను పెంచి పెద్ద చేశారు. ఆమెకు మున్సిపాలిటీలో స్వీపర్​గా ఉద్యోగం వచ్చింది. 2015లో పొదిలిలో పోస్టల్ శాఖలో పనిచేసే ముసలయ్యతో వివాహం జరిపించారు. కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. వారికి 2019లో బాబు జన్మించాడు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. తన భర్త మద్యం తాగి తరచూ ఆమెను కొట్టడం, అనుమానంతో వేధించడం ప్రారంభించాడు. ఆ చిత్రహింసలు భరించలేక రమాదేవి పుట్టింటికి వచ్చింది. వారి కాపురం చక్కదిద్దడానికి తండ్రి అన్ని విధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుమార్తె పడుతున్న బాధలు చూడలేక ఆయన 2019లో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి ఆమె తన బంధువుల వద్ద తలదాచుకుంటోంది.

స్వీపర్​గా పనిచేస్తూ వచ్చే జీతంతో బాబును పోషించుకుంటోంది. ఈ క్రమంలో బంధువులు ఆమె నుంచి బిడ్డను దూరం చేసి ఒంగోలులోని శిశువిహార్​కు పంపించారని రమాదేవి ఆరోపించింది. పసిబిడ్డను తన నుంచి దూరం చేయడంతో ఆ తల్లి విలవిల్లాడింది. తన బిడ్డను ఎలాగైనా దగ్గరకు చేర్చాలంటూ బంధువుల కాళ్లావేళ్లా పడి వేడుకుంది. కనికరించని బంధువులు ఆమెపై దురుసుగా ప్రవర్తించారు. భరించలేని రమాదేవి 20 రోజుల కిందట నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆసుపత్రిలో చేర్చి ఆమెను కాపాడారు. గురువారం అర్ధరాత్రి ఒంగోలు నుంచి గుంటూరు వచ్చి... న్యూగుంటూరు రైల్వే స్టేషన్​కు చేరుకుంది.

కత్తితో చేయి కోసుకున్న రమాదేవి రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించింది. సమాచారం తెలుసుకున్న డీఎస్సీ సుప్రజ అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో హుటాహుటిన రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కొత్తపేట పోలీసులు ఆమెకు తోడుగా వెళ్లారు. రైలు పట్టాలపై ఉన్న రమాదేవిని అక్కడనుంచి బయటకు తీసుకురావడానికి గంటన్నర సేపు బుజ్జగించారు. డీఎస్పీగా, పోలీసు అధికారిగా కాదు.. ఓ తల్లిగా చెబుతున్నానని సుప్రజ ధైర్యం చెప్పారు. తొందరపడి ప్రాణాలు తీసుకుంటే ఆ పసివాడికి తల్లి ప్రేమను దూరం చేసిన దానివి అవుతావని వివరించింది. అక్కడ నుంచి కొత్తపేట ఠాణాకు తీసుకెళ్లారు. ఆమె సమస్య పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని.. డీఎస్పీ సుప్రజ, సీఐ రాజశేఖర్ రెడ్డి భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండీ... ఆత్మగౌరవానికి ప్రతీక.. మన జాతీయ పతాక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.