Volunteer escape with pension amount : ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కోసం అందించే పింఛన్లు లబ్ధిదారులకు పంచడం అతని విధుల్లో భాగం. కానీ ఆ వాలంటీర్ తన డ్యూటీయే కాదు కనీస మానవత్వం కూడా మరిచి వారికి అందాల్సిన ప్రభుత్వ సాయాన్ని కాజేసి...ప్రియురాలితో పరారైన ఘటన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో చోటు చేసుకుంది.
మల్లవరపు రవిబాబు మూగచింతలపాలెం గ్రామ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ప్రభుతం వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కోసం అందించే పింఛన్లు లబ్ధిదారులకు పంచడం అతని విధుల్లో భాగం. కానీ తన కర్తవ్యాన్ని మరిచి ఆ సొమ్మును కాజేశాడు. లబ్ధిదారులకు పంచాల్సిన డబ్బును తీసుకుని ప్రియురాలితో పలాయనం చిత్తగించాడు. విషయం తెలుసుకున్న మూగ చింతలపాలెం సచివాలయ గ్రామ కార్యదర్శి, అధికారులతో పాటుగా రవిబాబు తండ్రికి సమాచారం అందించారు. కుమారుడి పనికి కుమిలిపోయిన తండ్రి...రవిబాబు తీసుకెళ్లిన డబ్బును సచివాలయ సిబ్బందికి చెల్లించారు. దీంతో సిబ్బంది ఆలస్యమైనా లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాలంటీర్ రవిబాబును విధుల నుంచి తొలగింపుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అయితే రవిబాబు గతంలో వివాహమై ఒక పాప కాగా...భార్య 9 నెలల గర్భవతని సమాచారం.
ఇదీ చదవండి : తెలంగాణలో తెరాస హైవే దిగ్బంధం.. రాష్ట్ర సరిహద్దులో వాహనాల నిలిపివేత