ఏపీకి ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో ఎంపీ అవినాష్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖమంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. పారిశ్రామిక పన్ను రాయితీలు ఇవ్వడం కుదరదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం... విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే దేశవ్యాప్తంగా అమలు చేయాలని తెలిపింది. ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా చేయడం సాధ్యం కాదని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. విశాఖలో నెలకొల్పిన మెడిటెక్ జోన్ బాగా పనిచేస్తోందని... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలతో వస్తే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి