కరోనా కేసుల వ్యాప్తితో మూతపడిన గుంటూరు మిర్చి యార్డు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమైంది. జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో...ఉన్న సరకు అమ్ముకోవటంపై రైతుల నుంచి వస్తున్న అభ్యర్థన ప్రకారం యార్డును తెరిచినట్లు అధికారులు తెలిపారు.
చాలా రోజుల తరువాత యార్డు తెరవటంతో జిల్లాతో పాటు ప్రకాశంకు చెందిన రైతులు తరలివచ్చారు. కొవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు చేపట్టారు. లావాదేవీలు జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని యార్డు ఛైర్మన్ ఏసురత్నం వెల్లడించారు.
ఇదీ చదవండి