ETV Bharat / city

Gang Rape: నోట్లో వస్త్రం కుక్కి.. బాలికపై సామూహిక అత్యాచారం - గుంటూరు నేర వార్తలు

gang rape on a girl: పెదకాకాని మండలంలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు యువకులు పథకం ప్రకారం బాలికపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

gang rape on a girl
బాలికపై సామూహిక అత్యాచారం
author img

By

Published : Mar 14, 2022, 7:30 AM IST

Gang rape on a girl: ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పథకం ప్రకారమే...

gang rape on a girl: పెదకాకాని మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. రెండో శనివారం సెలవు కావడంతో ఇంటివద్దే ఉంది. పక్కింట్లో ఉండే బీటెక్‌ విద్యార్థి బ్రహ్మం, వెల్డింగ్‌ పని చేసే బాజి వరప్రసాద్‌, నరసింహారావు అనే యువకులు ఆమెపై లైంగిక దాడి చేయాలని పథకం వేశారు. తొలుత బ్రహ్మం ఆమెకు మాయమాటలు చెప్పి.. తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న మరో ఇద్దరూ కలిసి ఆమె నోట్లో వస్త్రం కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపి, కేసు నమోదు చేశారు. ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాస్‌ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.

ఇదీ చవదండి:

శిశువు తల నోట కరచుకొని పరిగెత్తిన కుక్క.. ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.