గుంటూరులోని మంగళ్‌దాస్ నగర్‌కు చెందిన వినయ్ సాయి ఈ నెల 17న ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. రోజు ఆలస్యంగా వస్తున్నాడని తన చెల్లి ప్రశ్నించినందుకు ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి వెంకటరమణ కుమారుడు వినయ్ సాయిని తీవ్రంగా మందలించారు. దీనిని అవమానంగా భావించిన వినయ్ తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద ఉన్న ఓ ప్రైవేటు కళాశాల సమీపంలోని వసతి గృహంలో గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు