చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరులోని ఆళ్లమడుగులో ఎస్ఈబీ, స్థానిక పోలీసులు నిర్వహించిన దాడుల్లో కల్తీ పాల తయారీని గుర్తించామని అధికారులు తెలిపారు. ఆళ్లమడుగు గ్రామానికి చెందిన మురహరి రెడ్డి గ్రామంలోని పాడి రైతుల నుంచి పాలు సేకరించి పుత్తూరు డైరీకి పంపిస్తాడని విచారణలో తెలిసిందన్నారు. అలా సేకరించిన పాలల్లో రసాయనాలు, పాల పొడులు, వంట నూనెలు కలిపి వెన్నశాతం అధికంగా వచ్చేలా వాటిని మారుస్తున్నాడని చెప్పారు. దాడుల్లో ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు... అతని నుంచి పరికరాలు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నకిలీ విత్తనాల వ్యవహారం..
గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నకిలీ మిరప విత్తనాలు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అమరావతి మండలం ఖంబంపాడు గ్రామం నుంచి గుంటూరు ట్రాన్స్‌పోర్టుకు ఆటోలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. సరకు, ఆటోను సీజ్ చేసి.. ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న విత్తనాలు సుమారు రూ.4 లక్షలు విలువ చేస్తాయని తెలిపారు.
ఇదీ చదవండి:
flower markets in loss: కొవిడ్ ధాటికి.. పూల రైతులు, వ్యాపారులు విలవిల!