ఊళ్లలో ఒక వర్గాన్ని వారిని ఖాళీ చేయించి.. పల్నాడు ప్రశాంతంగా ఉందని పోలీసులు ఎలా చెప్తారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు నిలదీశారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు పనిగట్టుకుని మీడియా సమావేశం నిర్వహించి పల్నాడు ప్రశాంతంగా ఉందని పోలీసులు చెప్పడం రాజకీయ ఒత్తిడి ఫలితమేనని ఆయన ఆరోపించారు. పల్లెల్లో రెండు వర్గాలతో చర్చించి, ప్రశాంత వాతావరణం కల్పించాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. తెదేపా బాధితులంటూ ఐదేళ్ల తర్వాత వైకాపా శిబిరం పెట్టడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తెదేపా బాధితులంటూ ఉంటే అప్పుడు వైకాపా నేతలు ఏంచేశారని అని ప్రశ్నించారు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేని ఈ బాధితులు ఇప్పుడు వచ్చారంటే ఇది కుట్ర పూరితమే అని ఆరోపించారు.
ఇదీ చదవండి: