ETV Bharat / city

పోలీసులపై కక్ష సాధింపు తగదు.. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ - ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

MLA Anagani on Police issue: ప్రభుత్వం పోలీసులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న పోలీసులపై కక్ష సాధింపులు తగవని హితవు పలికారు.

TDP MLA Anagani Satya Prasad
anagani satyaprasad
author img

By

Published : Aug 31, 2022, 5:28 PM IST

TDP MLA Anagani Satya Prasad: పోలీసుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామన్న మాట ఏమైందని నిలదీశారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సాక్షిగా యేటా 6 వేల ఉద్యోగాలన్నారని, కొవిడ్ విధుల్లో చనిపోయిన వారిలో ఒక్కరికైనా సాయం చేశారా.. అని అనగాని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న పోలీసులపై కక్ష సాధింపులు తగవని హితవు పలికారు. సమస్యలు పరిష్కరించాలని వేడుకున్న కానిస్టేబుల్ ప్రకాష్​ను విధుల నుంచి తప్పించడం దుర్మార్గమని మండిపడ్డారు. కానిస్టేబుల్ ప్రకాష్ కుటుంబాన్ని పండగపూట పస్తులుండేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబం ఉసురు ఈ ప్రభుత్వానికి తగలక మానదన్నారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని జగన్ రెడ్డి దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.