ETV Bharat / city

TDP financial assistance to Sida in Narasaraopet: 'సైదాకు తెదేపా ఆర్థిక సాయం.. నాయకుల బృందం పరామర్శ' - వరదల తాజా వార్తలు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కార్యకర్త సైదాను తెదేపా నేతలు పరామర్శించి పార్టీ తరఫున ఆర్థిక సహాయం(TDP financial assistance to Sida in Narasaraopet) అందించారు. అధికార పార్టీకి పరిపాలను చేతకాకనే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

సైదాకు తెదేపా ఆర్థిక సాయం
TDP financial assistance to Sida
author img

By

Published : Nov 28, 2021, 9:50 PM IST

వైకాపా శ్రేణుల దాడిలో గాయపడి నరసరావుపేటలో చికిత్స పొందుతున్న తెదేపా కార్యకర్త సైదాను తెదేపా మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, చదలవాడ అరవింద బాబు బృందం పరామర్శించింది. దాడులకు పాల్పడిన వైకాపా నాయకులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారు అన్నారు. చికిత్స పొందుతున్న బాధితుడికి పార్టీ తరఫున రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని నేతలు(TDP leaders financial assistance to Sida on behalf of party) అందజేశారు. అనంతరం తెదేపా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 131 వ వర్ధంతిని నిర్వహించారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు కనిపించడం మానేశారని.. ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు నిరుపయోగంగా మారాయని ఎద్దేవా చేశారు. రైతులకు కనీసం విత్తనాలు సైతం అందించలేని స్థితిలో పాలన నడుస్తోందని(YSRCP poor administration) ఆరోపించారు. అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

''వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త షేక్ సైదాను ఆసుపత్రిలో కలిశా. రాళ్లతో, రాడ్లతో సైదాపై విచక్షణారహితంగా దాడి అమానుషం. వైకాపా నేతలు ముస్లింలపై దాడులు సమర్థిస్తారా?. పిన్నెల్లి గ్రామంలోని కార్యకర్తల కుటుంబాలను దాడి చేసి వెళ్లగొట్టారు. తురకపాలెంలో దాడులు నిర్వహించి వృద్ధ దంపతులపై మర్డర్ కేసులు పెట్టడం దారుణం. 30 సంవత్సరాల క్రితం పేదలకు అందించిన ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పుడు బిల్లులు చెల్లించమని అడగడం దుర్మార్గం. రెండున్నరేళ్లు గడుస్తున్నా రహదారి నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు.'' - యరపతినేని శ్రీనివాసరావు, తెదేపా మాజీ ఎమ్మెల్యే

రైతులకు పంట నష్టం అందించాలని..

గుంటూరు జిల్లా నాదెండ్ల, యడ్లపాడు మండలాలలోని చిరుమామిళ్ల, జంగాలపల్లి, సొలస తదితర గ్రామాలలో దెబ్బతిన్న మిర్చి, పత్తి తదితర పంటలను మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, తెలుగు రైతు అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పత్తి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేలు, మిర్చి ఎకరాకు రూ. 70 వేల నుంచి రూ. లక్ష, వీటితో పాటు దెబ్బతిన్న మిగిలిన పంటల రైతులకు పంట నష్టాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్(Government should help farmers for crop loss due to rains) చేశారు.

తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి వెంటనే కొనుగోలు చేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. ప్రజలకు భరోసా కల్పించాల్సి సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి పరిమితమవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ వరదలు వచ్చే ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పాలన చేతగాకనే ప్రజలకు కష్టాలు..

అధికార పార్టీకి పాలన చేతకాకపోవడం వల్లనే.. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదనకు పుల్ స్టాప్ పెట్టి.. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ఇన్​పుట్​ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవీ చదవండి:

Financial Burden on AP : రాష్ట్రంపై ఆర్థిక భారం రూ.6.82 లక్షల కోట్లు?

MP Raghu Rama Krishna Raju Letter to PM: ఏపీ అప్పులపై కేంద్రం సత్వర చర్యలు తీసుకోవాలి - ఎంపీ రఘురామ

Amaravati CA's Association on CAG report: 'దివాళా దిశగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. మేధావులు మేల్కోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.